విశాఖపట్నం గ్యాస్ విషాదం
విశాఖపట్నం లో గ్యాస్ విషాదం విశాఖపట్నంలో తెల్లవారుజామున 2:30 నుండి 3:00 గంటల వరకు స్టైరిన్ అనే గ్యాస్ లీక్ అయి 15 మంది సభ్యులు మరణించారు మరియు 5000 మంది ఈ గ్యాస్ బారిన పడ్డారు. విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్ వెంకటపురం గ్రామం వద్ద ఉన్న బహుళజాతి ఎల్‌జి పాలిమర్స్ ప్లాంట్ ద్వారా స్టైరిన్ వాయువు లీక్ అయింది., గుంతల దగ్గర, మరియు రహదారిపై చాలా మంది అపస్మారక స్థితిలో పడి ఉన్నారు . విశాఖపట్నంలోని పాలిమర్ ప్లాంట్ నుండి 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో టాక్సిక్ గ్యాస్ స్టైరిన్ వ్యాపించింది. అపస్మారక స్థితికి చేరుకోవడం మరియు బావులు లో పడటం వల్ల ఎక్కువ శాతం మరణాలు సంభవించాయి. మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ సిఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు పరిహారం గా ప్రకటించారు మరియు ఈ విషాదంపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. తదుపరి సిఎం జగన్ గారు బాధిత ప్రజలను సందర్శించారు. పాలీస్టైరిన్ ప్లాస్టిక్స్, పైబర్స్, రబ్బరు మరియు latix తయారీకి ఉపయోగించే మంటగల ద్రవం గా స్టైరిన్ వాడుతారు. ఇది కొన్ని పండ్లు, కూరగాయలు, మాంసాలు, కా...