చనిపోయిన ఏనుగు కు ఒక వేళా మాటలు వస్తే అది ఇలా మాట్లాడుతుంది.
చనిపోయిన ఏనుగు కు ఒక వేళా మాటలు వస్తే అది ఇలా మాట్లాడుతుంది.
నా పేరు ఏనుగు . నా వయసు 15 సంవత్సరాలు.
నా ఇల్లు ప్రకృతి . కొన్ని రోజులు గా ఎండలు మండి పోతున్నాయి. కొందరి (మానవులు )వలన మా ఇల్లు చాలావరకు పాడైపోయింది. మా ఇంట్లో ఉన్న ఎన్నో చెట్లు అంతరించి పోయాయి . మా తోటి జీవులు కూడా కొన్ని అంతరించి పోయాయి. ఇప్పుడు ఇంకో కొన్ని రోజుల్లో మేము కూడా అంతరించి పోవడానికి సిద్ధంగా వున్నాము .
అయితే కొన్నిరోజులు గా మాకు ఆహారం దొరకడం లేదు. మా ఇంట్లో వున్న అన్ని రకాల సదుపాయాలను మానవులు వాడుకున్నారు. కానీ మాకు మనుషులపై ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే మాకు ఏమైనా సమస్య వస్తే మానవులు ప్రేమగా వ్యవహరిస్తారు అని.
ఒక రకంగా చెప్పాలంటే మానవులంతా మాకు సోదరసమానులే ఎందుకంటే వారు కూడా మా ఇంటి (ప్రకృతి ) నుండి పుట్టినవారే కదా.
బహుశా ఆ చనువు తోనే కావచ్చు ఆహరం కోసం మీ దగ్గరకు వచ్చాను. కానీ మాకు తెలీదు. మీకు మమ్మల్ని చంపేసే అంత కోపం ఉందని.
కానీ ఇప్పటికి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటె.
మేము మానవులం కాకపోవచ్చు కానీ మాకు మానవత్వం వుంది.
మాకు మాటలు రాకపోవచ్చు కానీ మాకు కూడా భావాలూ వున్నాయి.
మేము తెలివైన జీవులం కాకపోవచ్చు కానీ చెడ్డవాళ్ళం మాత్రం కాదు.
మేము మీ తోటి జీవులు కాకపోవచ్చు, కాని మీరు మా తోటి జీవులు. మీరు మరియు మేము అందరం ఒకే స్వభావం నుండి పుట్టాము.
మానవులు గుర్తుంచుకోండి ...
మా ఇల్లు మీ స్వస్థలం. మీ రోజువారీ జీవితంలో మీరు 90% ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు కావున ప్రకృతి బాగుంటే మీరు బాగుంటారు.
దయచేసి ప్రకృతి ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.
ఈ రోజు ప్రకృతి బాగుంటే నేను మీ వద్దకు వచ్చే దాన్ని కాదు. ప్రాణాలు కోల్పోయేదాన్ని కాదు.
-written by Saiteja
Comments
Post a Comment