రష్యా అధ్యక్షుడు పుతిన్ సైబీరియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు

రష్యా అధ్యక్షుడు పుతిన్ సైబీరియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు


రష్యాలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీలలో ఒకటైన నోరిల్స్క్ నికెల్ యాజమాన్యంలోని రష్యన్ పారిశ్రామిక కర్మాగారం మే 29 న ఆర్కిటిక్ సర్కిల్‌లో 20000 టన్నుల చమురును వేదచల్లింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సైబీరియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆర్కిటిక్ సర్కిల్ వద్ద, తూర్పు రష్యాలోని అంబర్నాయ నది చమురు లీకేజీతో భారీగా దెబ్బతింది, దాదాపు 17,000 టన్నుల నూనెను నదిలోకి చిందించింది మరియు నదిని తిరిగి శుభ్రపరచడానికి  ఒక దశాబ్దం మరియు బిలియన్ డాలర్లు ఖర్చు  పడుతుందని రష్యన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ తెలిపింది. 

ఈ సంఘటన సైబీరియన్ ద్వీపకల్పంలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో రష్యా యొక్క తూర్పు భాగంలో జరిగింది మరియు పారిశ్రామిక ప్లాంట్ వద్ద యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని  స్థానిక మీడియా నివేదించింది.
 
డీజిల్ ప్రవాహాన్ని నియంత్రించడానికి అడ్డంకులను ఉపయోగించి కొంత వరకు కట్టడి చేసారు . ప్రస్తుతం అనేక జల జాతులు నదిలో చనిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది రష్యాలో అతిపెద్ద పర్యావరణ విపత్తుగా పరిగణించబడుతుంది.

Comments

Popular posts from this blog

Tulasi-The Wonder Herb

What is the 5G capability in India?

When a dead elephant comes to talk, it speaks like this