పెరిని శివ తాండవం :

పెరిని శివ తాండవం :

భారతదేశం కళల కు మరియు జ్ఞానం కు పెట్టింది పేరు . అదే విధంగా ఈ దేశం భరత నాట్యం, కథక్ ,కూచిపూడి వంటి ఎన్నో నాట్య కళల  కు పుట్టిన ఇల్లు .  అయితే ఇందులో కొన్ని నేటికీ ఎంతో కీర్తి ని గడిస్తున్నాయి .  కానీ కొన్ని మాత్రం కనుమరుగై మరుగున పడ్డాయి. అలాంటి ఒక గొప్ప నాట్య కళ ఈ పేరిణి నృత్యం . 

1970 వరకు కూడా దీనిపై ఎలాంటి పరిశోధన లేదు మరియు దీని గుంరించి ఎవరు పట్టినించుకోలేదు అటువంటి సమయంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దీని పై పరిశోధన చేసి దీనిని పునరుద్ధరించారు. 

పెరిని శివ తాండవం  లేదా పెరిని తాండవం ఇది  తెలంగాణనను చివరిగా పరిపాలించిన కాకతీయుల రాజవంశ  పరిపాలన లో అత్యంత ప్రాచుర్యం లో ఉండేది. కాకతీయల పరిపాలనలో ఇది ప్రతి దేవాలయం లో కనీసం 6 సార్లు ప్రదర్శించేవారు.  మహేశ్వరులు , పశుపతులు, మైలవారపు దేవుళ్ళు, మరియు మెదలయిన తెగలకు సంభందించిన ఎంతో మంది మగవారు దీనిని ప్రదర్శించేవారు. 

హిందూ  దేవుడైన శివుని గౌరవార్థం పెరిని నృత్యం ను  నిర్వహిస్తారు మరియు సైనికులు యుద్ధానికి వెళ్ళుటకు  ముందు సైనికుల యోక్క విజయ కాంక్ష ను బల పరుచుటకు దీనిని  నిర్వహించే వారు .
ఈ నృత్యం ను ప్రత్యేక్షం గా చూసినప్పుడు ఎన్నడూ చూడనటువంటి అద్భుతమైన అనుభూతి మనం పొందగలం. ఇది చూసినప్పుడు సాక్షత్తు  శివుడే రుద్రుడై  నాట్యం చేస్తునట్లు ఉంటుంది . 
 
పెరిని శివ తండవం సాధారణంగా మగవారు చేసే నృత్య రూపం. దీనిని 'డాన్స్ ఆఫ్ వారియర్స్' అంటారు. యుద్దభూమికి బయలుదేరే ముందు యోధులు శివుడు (శివ) విగ్రహం ముందు ఈ నృత్యం చేస్తారు. ఇది కాకతీయుల  పరిపాలన కాలం చివరి దశ లో అంతరించు దశ  కు చేరుకుంది. 



పెరిని తాండవం, తెలంగాణ ఈ నృత్య రూపం 'ప్రేరానా' (ప్రేరణ) ను ప్రేరేపిస్తుందని మరియు నృత్యానికి ఆది గురువు అయిన (సుప్రీం డాన్సర్) శివుడికి అంకితం చేయబడిందని నమ్ముతారు. వరంగల్ లోని రామప్ప ఆలయానికి చెందిన  గర్భగుడి సమీపంలో ఉన్న శిల్పాలలో ఈ నృత్యానికి ఆధారాలు చూడవచ్చు.

పెరిని అనేది డ్రమ్స్ యొక్క అద్భుతమైన బీట్లకు చేసే  శక్తివంతమైన నృత్యం. నృత్యకారులు ఈ నృత్యం లో తమ శరీరంలో కి శివుని శక్తిని అనుభవించేసి మానసిక సంగ్రహణ స్థితికి చేరుకుంటారు. నృత్యం చేస్తున్నప్పుడు వారు శివుడిని తనలోకి వచ్చి అతని ద్వారా నృత్యం చేయమని పిలుస్తారు. పెరిని తండవం నిజానికి అత్యంత ఉత్తేజకరమైన నృత్య రూపంగా నమ్ముతారు. 

కాకతీయ  రాజవంశం క్షీణించిన తరువాత పెరిని నృత్య రూపం దాదాపుగా కనుమరుగైంది, కాని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ పెరిని నృత్యంలో పునరుజ్జీవనాన్ని తెచ్చారు, ఇది విలుప్త అంచున ఉంది.
తెలంగాణ ప్రాతం లో పురుడు పోసుకున్న ఈ నృత్యాన్ని ప్రపంచ మరియు దేశ, రాష్ట్ర వ్యాప్తం గా గుర్తించ వలసిన అవసరం ఎంతో వుంది. 
పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పునరుజ్జివింప చేసిన ఈ నృత్యం నేడు కొంత మంది వ్యక్తుల ద్వారా వెలుగులోకి వస్తుంది. దీని గురించి మీరు యూట్యూబ్ యందు పర్యవేక్షిస్తే మరింత సమాచారం తెలుసుకోగలరు. 

ఈ  ఆర్టికల్ నచ్చిన వారు షేర్ చేసి ఇతరులకు చెప్పగలరని నా మనవి . మన సంస్కృతి ని మనం తెలుసుకోవడం మంచి విషయం అని నా భవన.
ఈ వ్యాసంలో నేను ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. మీకు దీని గురించి ఏదైనా తెలిస్తే, దయచేసి వ్యాఖ్యానించండి(comment). నేను దాన్ని అప్‌డేట్ చేస్తాను. 
ధన్యవాదములు. 

 Telangana's Graceful Past: Perini Shivatandavam - Go Heritage Runs ...      

We are developing the educational content for M.sc and more in the future. For reading the beta content follow textsearch.biz please subscribe to us on both blogs and websites. Visit again

We are constantly improving ourselves and trying to give the best content to our users every day. Your donations may help us to develop the content and enable us to serve you with the latest and the oldest of the amazing world facts and educational content.

 

PLEASE DONATE THROUGH THE FOLLOWING LINK: https://rzp.io/l/textsearchdonations



Comments

Popular posts from this blog

Tulasi-The Wonder Herb

What is the 5G capability in India?

THE STORY BEHIND THE GOOGLE